Wednesday, January 22, 2025

పార్శిగుట్టలో వ్యక్తి గల్లంతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 2 గంటల పాటు నాన్ స్టాప్ వర్షం కురిసింది. దీంతో నగరంలో  లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. కార్లు, ఆటోలు, బైక్ లు అన్ని వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీటిలో పలు బైక్ లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కురవడంతో మలక్‌పేట రైల్వే స్టేషన్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పార్శిగుట్టలో వరద నీటికి గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు.మరో రెండు గంటల పాటు హైదరాబాద్‌లో భారీ వాన కురుస్తుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏదైనా సమస్యకు టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News