Sunday, December 22, 2024

తటాకాలైన రోడ్లు తండ్లాడిన జనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్‌టౌన్ : తెలంగాణపై కుండపోతగా వర్షం కురిసింది.పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు ఇ ద్దరు వ్యక్తులు మృతి చెందారు. సోమవారం మధ్యా హ్నం కురిసిన భారీ వర్షంతో గ్రేటర్‌హైదరాబాద్ ప్ర జలు రోడ్లపైనే నరకం చవిచూశారు.ఏకధాటిగా గం టన్నరకుపైగానే వర్షం కురిసింది వర్షానికి తాళలేక ప్రజలు మెట్రోరైల్ ప్లైఓవర్ చాటుకు పరుగులు తీశా రు. చెట్లకింద తలదాచుకున్నారు. గచ్చిబౌలి, కొండాపూర్ మాదాపూర్ , జూబ్లిహిల్స్ , అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ కిలోమీటర్ల మేర కు స్తంబించిపోయింది.షేక్‌పేట ప్లైఒవర్‌పైన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. షేక్‌పేటఫిలింనగర్ ,గచ్చిబౌలి మార్గంలో , మెహదీపట్నం టోలిచౌ కి మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తా ర్నాక ఎల్‌బి నగర్ మార్గంలో నిలిచిపోయిన ట్రాఫిక్‌కు తిరిగి పునరుద్దరించేదుకు
పోలీసులకు మూడుగంటలకుపైగా సమయం పట్టింది.

గచ్చిబౌలి ప్రాంతంలో 5కి.మి మేరకు వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు వర్షపునీటితో మునకేసి చెరువులను తలపించాయి. సికింద్రాబాద్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో తటాకాలను తలపించాయి. షేక్‌పేట సెంట్రల్ వద్ద మీడియన్‌కు ఇరువైపులా వర్షపు నీరు చేరటంతో పాదాచారులు నడుములోతు నీటిలో నడవాల్సివచ్చింది. పలు చోట్ల వర్షపు నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షపునీటిలో చిక్కుకుపోయిన కారును పోలీసులు క్రేన్ల సాయంతోఎ పైకిలేపాల్సివచ్చింది. రక్షాబంధన్‌కావటంతో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇళ్లనుంచి బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళలు మరింతగా అవస్థలు పడ్డారు. పూలు, పండ్లు , రాఖీల విక్రయించే వ్యాపారులు ఆకస్మిక వర్షంతో భారీగా నష్టపోయారు.సాయంత్రం కూడా మరో మారు నగరంలోని పలు ప్రాంతాల్లో బారీ వర్షం కురిసింది. కుత్భుల్లాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ట, బోయిన్‌పల్లి , బాచుపల్లి, మలక్‌పేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నిజామాబాద్ ఆర్టీసి బస్‌లో హాహాకారాలు :
మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిజామాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.బస్సులోకి నీరు చేరుతుండటంతో ప్రయాణీకులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. పోలీసులు, స్థానికులు సత్వరమే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. మరోవైపు బోధన్, ఆర్మూర్, బీర్కూర్, నవీపేట, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, సిరికొండ మండలాల్లో జోరు వాన కురిసింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా వర్షం కురువడం వల్ల ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోవడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది.

సంగారెడ్డిలో భారీ వర్షం :
సంగారెడ్డి నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సదాశివపేట పట్టణంలో వర్షానికి డ్రైనేజీ నీరు నిండి రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, వర్షాలు కురిసినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
షేక్‌పేట్‌లో 53.3మి.మి వర్షం
గ్రేటర్‌హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా షేక్‌పేట్‌లో 53.3మి.మి వర్షం కురిసింది. యూసఫ్‌గూడలో 52, రాయదర్గంలో 51, ఫిల్మ్‌నగర్లో 48, బాలనగర్‌లో 42, వెస్ట్‌మారేడుపల్లిలో 39, గాయత్రి నగర్‌లో 37 మి.మి చొప్పున వర్షం కురిసింది.

సిద్దిపేటలో 108మి.మి
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా దుల్మిట్లలో 105.5మి.మి వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 106.5మి.మి వర్షం కురిసింది. జూనుతలలో 101, చాట్లపల్లిలో 95.3, గడిపల్లిలో 91.8, యాదగిరిగుట్టలో 88.3, కట్కూర్‌లో 85, నిజామాబాద్‌లో 85, కట్టంగూర్‌లో 84, కొమరవెల్లిలో 84, వనల్‌పహడ్‌లో 77 మి.మి చొప్పున వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News