Saturday, December 21, 2024

కడగండ్లు.. మరో మూడు రోజులూ వర్షాలే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్క సారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకూ ఎండల ధాటికి శగలు చిమ్మిన వాతావరణం సాయంత్రం భారీ వర్షాలతో చల్లబడింది. రాజధాని నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వండగండ్ల వానలు పడ్డాయి. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 3సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ,దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 1.5కి.మి ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో భార్షాలు, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉంది . బలమైన ఈదురు గాలులు గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

శుక్రవారం రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్, జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ ,హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చెల్ మల్కాజిగిరి ,సంగారెడ్డి ,మెదక్ ,కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు ,మెరుపులు, గంటకు 50.కి.మి వేగంతొ బలమైన ఈదురు గాలులు ,వడగండ్ల వానలు కురిసేఅవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. శనివారం అదిలాబాద్ , కొమరంభీమ్ , మంచిర్యాల, నిర్మల్ , జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి ,హైదరాబాద్ ,మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, గంటకు 40కి.మి వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది.

గురువారం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో కొసిగిలో 18 మి.మి వర్షపాతం నమోదయింది. గొల్కొండలో 17.8, షేక్‌పేటలో 13.4, గండిపేటలో 12, గుండాలలో 9.4, మహేశ్వరంలో 9, శంషాబాద్‌లో 8.5, కొడంగల్‌లో 6.2, పాల్వంచలో 2.7 మి.మి చొప్పున వర్షం కురిసినట్టు వాతవరణ కేంద్రం వెల్లడించింది.
అదిలాబాద్‌లో 40డిగ్రీల ఉష్ణగ్రత:
రాష్ట్రంలో మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. అత్యధికంగా అదిలాబాద్‌లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామబాద్‌లో 39.6, మహబూబ్ నగర్‌లో 38.8, భద్రాచలం , నల్లగొండ, 38డిగ్రీలు, ఖమ్మంలో 37, మెదక్‌లో 37.3, రామగుండంలో 37.2,హైదరాబాద్ , హన్మకొండలలో 35.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News