Wednesday, January 22, 2025

ఉదయం ఉక్కపోత..రాత్రి కుండపోత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం ప లుచోట్ల భారీ వర్షం కురిసింది. మరోవైపు హైదరాబాద్‌లో వాతా వరణం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఓ పక్క వర్షం..ఇంకో పక్క ఉక్కపోత నెలకొంది. పలు ప్రాంతాల్లో ఉక్కపోతతో నగరవాసు లు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహ దారిపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సెలవు రోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. హై దరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భా రీ వర్ష సూచనపై జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందిం చారు. అత్యవసరమైతే

తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావ ద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగం లోకి దిగాయి. జీహెచ్‌ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి ట్రా ఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోయిన్‌పల్లి, అల్వాల్, సి కింద్రాబాద్, పటాన్‌చెరు,జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్‌పేట, హైటెక్ సిటీ, నాంపల్లి, ఖైరతాబాద్, అసెంబ్లీ, లక్డీకాపూల్, దిల్‌షుక్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అయితే నాన్‌స్టాప్ వర్షంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయం కావడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు వరదనీటిని తొలగించేందుకు మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేశారు. దీంతో ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News