Monday, January 20, 2025

ఊపందుకున్న వానలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/వాజేడు/ భద్రాచలం : నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీకలంగా మా రాయి. గత 24గంటలుగా రాష్ట్రమంతటా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రో జుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యాక తొలిసారి తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది .ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒ డిస్సా తీరంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మి ఎత్తు వరకూ కొనసాగుతూ , ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశవైపునకు వంగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో వాయువ్య బం గాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఉపరిత ల ఆవర్తనం దక్షిణ చత్తీస్‌గఢ్ మీద కొనసాగుతూ సగ టు సముద్ర మట్టం నుండి 1.5 కి.మి ఎత్తు వరకూ వుంది. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫియర్ జోన్ ప్రభావం వల్ల తెలంగాణ తూ ర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలను అప్రమత్తం చేసింది. రాగల 24గంటల్లో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి మేడ్చెల మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రెండవరోజూ భారీ వర్షాలే!
రాష్ట్రంలో రెండవ రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ,కామారెడ్డి, జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవాకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ , హనుమకొండ, జనగాం , సిద్దిపేట, రంగారెడ్డి హైదరాబాద్ ,మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
మూడవ రోజు ఆరెంజ్ ఆలర్ట్
రాష్ట్రంలో మూడవ రోజు వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఎడతెరిపి లేని వర్షాలు
రాష్ట్రంలో గత 24గంటలుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది పరివాహకంగా భారీ వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి తదితర ఉపనదులు వరదనీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాణహిత, పెన్‌గంగ నదుల్లో వదర ఉధృతిని గమనిస్తూ అదిలాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేశారు. త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరద పెరిగింది. మేడిగడ్డకు వరదనీరు పొటెత్తింది. లక్ష్మిబ్యారేజి 35గేట్లు ఎత్తి 1,63,349 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. దిగువన సమక్కబ్యారేజిలోకి ఇంద్రావతి వరదతోకలిసిన గోదావరి ఉధృతి మరింతగా పెరిగింది. బ్యారేజి 33గేట్లు ఎత్తివేసి 1,95,000క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వాజేడు మండలం బొగత జలపాతం వద్ద ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ముందు జాగ్రత్త కింద పర్యాటకుల సదర్శనలు నిలిపివేశాలు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెంతోపాటు ఖమ్మం, జిల్లా సత్తుపల్లి కేంద్రాల్లో బోగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో గరిష్టంగా ఏటూరు నాగారంలో 71.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డిలో 62, గన్నారంలో 60.8, ఎడపల్లిలో 54, నవీపేటలో 52.5, గాంధారిలో 52.3 మి.మి వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నిలిచిన బొగ్గు ఉత్పతి
వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు తీసే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా.. సింగరేణి అధికారులు నీటిని మోటర్ల సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు. మొత్తం భూపాలపల్లి వ్యాప్తంగా 503.8 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News