Sunday, December 22, 2024

కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. ఏడుగురు మృతి(వీడియో)

- Advertisement -
- Advertisement -

కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని చెన్నైతోపాటు పలు జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైలోని పలు కాలనీలు నీట మునిగపోయాయి. దీంతో రవాణా స్తంభించిపోయింది.

భారీగా ప్రవహిస్తున్న వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చెన్నై పోలీసు విభాగం, విపత్తు పునరుద్ధరణ విభాగం సహాయ చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

భారీగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను మంగళవారం(డిసెంబర్ 5న) తీరం దాటే అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా.. ఈరోజు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలలో సెలవు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News