పాఠశాలలకు సెలవులు కొట్టుకుపోతున్న వాహనాలు, ఇంటి
సామగ్రి మంత్రి కెటిఆర్ ఆదేశాలతో సిరిసిల్లకు డిఆర్‌ఎఫ్
బృందాలు పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు
అప్రమత్తంగా ఉండాలి : కెటిఆర్ జగిత్యాల జిల్లాలో వరద నీట
కొట్టుకుపోయి తండ్రి,కొడుకు మృతి వరదలో చిక్కుకున్న లారీ,
మత్తడి దుంకుతున్న రామప్ప చెరువు నేడు, రేపు, ఎల్లుండి
తేలికపాటి వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలం
మనతెలంగాణ/ హైదరాబాద్: ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు పలు జిల్లాలో వర్షం జనజీవనాన్ని స్తంభింప చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహంలో కార్లతో పాటు ద్విచక్రవాహనాలు, ఇంట్లో వాడుకునే సామగ్రి కొట్టుకుపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోకుండా వాటి యజమానులు తాళ్లతో వాటిని కట్టివేస్తున్న దృశ్యాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామా బాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చెరువు అలుగు పారుతుండడంతో పక్కనే ఉన్న ఫౌల్ట్రీపామ్ మునిగిపోవడంతో అందులో ఉన్న కోళ్లు కొట్టుకుపోయాయి.
ప్రస్తుతం సిరిసిల్ల పట్టణమంతా జలమయం అయింది. పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతమైన పాత బస్టాండ్ పెద్ద బజార్ వెంకంపేట రహదారి వరద నీటితో నిండిపోయింది. అక్కడి నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా వారిని స్థానికులు కాపాడారు. వరద బాధితులను ప్రొక్లెయిన్‌తో సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కెటిఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సిరిసిల్లలో వర్షబీభత్సంపై మంత్రి కెటిఆర్ సమీక్షించారు. మంత్రి ఆదేశాలతో రెండు డిఆర్‌ఎఫ్ బృందాలు హైదరాబాద్ బోట్లు, సహాయ చర్యల పరికరాలతో హైదరాబాద్ నుంచి బయలుదేరాయి.సిరిసిల్లలోని ప్రగతినగర్, సాయినగర్, అంబికానగర్, శాంతినగర్, గాంధీనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోనూ భారీగా వర్షపు నీరు చేరింది. సిరిసిల్లలో విద్యాసంస్థలకు కలెక్టర్ అనురాగ్ జయంతి సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు. ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం 9398684240 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వేములవాడ నుంచి కరీంనగర్‌కు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి.
వరద నీటిలో కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు మృతి
జిల్లా గొల్లపల్లి మండ లం మల్లన్నపేటలో వరద నీటిలో కొట్టు కుపోయిన తండ్రి, కుమారు డు మృతి చెందారు. మల్లన్నపేట వద్ద గంగమల్లు, విష్ణువర్ధన్ మృత దేహాల లభ్యం కాగా మృతులు గొ ల్లపల్లి మండలం నందిపల్లి వాసు లుగా గుర్తించారు. ఇదే జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మూడురోజులుగా గోదావరి పాయలో చిక్కుకున్న ము గ్గురు గొర్రెల కాపర్లు కాపాడడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీరు వదలడంతో గోదావరిలో ఉద్ధృతి పెరుగుతోంది. వారిని కాపాడడం అధికారులకు తలకు మించిన భారంగా మారడంతో వారికి తినడానికి ఆహార పదార్ధాలను అధికారులు చేరవేస్తున్నారు. మేడిపల్లి మండలంలో వరదనీటిలో కారు చిక్కుకుపోవడంతో స్థానికులు వెంటనే రక్షించారు. గొల్లపల్లి మండలం బొంకూర్‌లో విద్యుత్ షాక్‌తో అంగన్‌వాడీ టీచర్ దుర్మరణం చెందింది.
వరదలో చిక్కుకున్న లారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. టేకులపల్లి మండలం కోయగూడెం గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచినపోగా, ఇల్లెందు ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మండ లం రైల్వేస్టేషన్‌లో ట్రాక్ జలమయమైంది. పంతిని చెరువు అ లుగు పారడంతో వరంగల్‌ఖమ్మం జాతీయ రహదారి జలమయమైంది. ఖమ్మం వైపు వెళుతున్న ఓ లారీ ఈ వరదలో చిక్కుకుపోయింది.
రుద్రూర్- బొప్పాపూర్ మార్గంలో గుండ్ల వాగు ఉద్ధృతం
నిజామాబాద్ జిల్లాలోని పలు కాలనీలు నీట మునిగాయి. మోతె వద్ద వంతెన పైనుంచి కప్పలవాగు ప్రవహిస్తుండడంతో వేల్పూర్- భీంగల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, దీంతోపాటు రుద్రూర్ -బొప్పాపూర్ మార్గం లో గుండ్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప చెరువులో 36 అడుగులకు నీటిమట్టం చేరింది రామప్ప చెరువు నుంచి 2 అడుగుల మేర నీటి ప్రవాహం మత్తడి దూకు తోందని అధికారులు తెలిపారు.
ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా 9జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీచేశారు.
నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు
దక్షిణ చత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉ పరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ- వాయవ్య దిశగా ఇది ప్రయాణించే అవకాశం ఉందని వా తావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు ఈ నెల 11న బంగాళాఖాతంలో అ ల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనిఅధికారులు తెలిపారు.