Friday, November 22, 2024

తెలంగాణలో అతి భారీ వర్షాలు: హెచ్చరికలు జారీ

- Advertisement -
- Advertisement -

Heavy Rains alert in Telangana

హైదరాబాద్: రానున్ను రెండు మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిహెచ్ఎంసి అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని తెలిపారు.

జంటనగరాల వాసులు సాయం కోసం 040- 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసి అధికారులు కోరారు.ఇక, రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంపై గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా ఏర్పడుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణశాఖ సూచించింది.

Heavy Rains alert in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News