Monday, December 23, 2024

మంథనిలో బాహుబలి సీన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కరీంనగర్ బ్యూరో: వరద ఉధృతి వేళ మంథనిలో బాహుబలి సీన్ నెట్టింట్లో వైరల్ కావడం అందరినీ అబ్బురపరచింది. పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతా కాదు. మంథని పట్టణంలోని మర్రివాడకు వరద ఉధృతంగా పెరగడంతో అక్కడి నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. బాహుబలి సీను తలపించేవిధంగా సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటి చేసే చూపిన దృశ్యాన్ని ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా కనపడింది. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల బాలుడిని బుట్ట లో పెట్టి తలపై ఉంచుకొని భుజాల వరకు వచ్చిన నీటిలో తల్లితోపాటు సురక్షిత ప్రాంతానికి పుప్పాల తిరుపతి కుటుం బం, పసివాడి తల్లితోసహా తరలించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మంథనిలో వరద పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ దృశ్యం కన్నులకు కట్టినట్టుగా చూపించింది.

Courtesy by Telangana Today

Heavy Rains: Bahubali scene viral in Manthani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News