Sunday, December 22, 2024

ఖమ్మంలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మిగ్ జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కుప్పకూలడంతో పుల్లారావు(45), లక్ష్మీ(43) దంపతులు మృతి చెందారు. దీంతో వారి కుటంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఎపి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలో భారీగా పంట నష్టం జరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తమైన చేసింది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News