Thursday, November 14, 2024

రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains for next 3 days in Telangana

హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోని కిందిస్థాయి గాలులు వీయనున్నాయని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం, బంగ్లాదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం రాగల 3,4 రోజుల్లో ఝార్ఖండ్, బీహార్ మీదగా వేళ్లే అవకాశముందని తెలిపింది.

Heavy rains for next 3 days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News