Saturday, November 16, 2024

తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రాగల ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తన ప్రభావంతో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో 11జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, ఆసిఫాబాద్ ,మంచిర్యాల ,నిర్మల్ , పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , నల్గగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట , యాదాద్రి భువనగిరి , రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ ,వికారబాద్,సంగారెడ్డి,

మెదక్ ,మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ,గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపధ్యంలో ప్రభుత్వం వివిధ శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కూడా అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 77 మి.మి వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలోని ఆసిఫ్‌నగర్‌లో 63.8, గోల్కొండలో 63.1, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 61.2, మంచిర్యాల జిల్లా బీమారంలో 61.2, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 60.8, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 50.3, గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్‌లో 49.9, ఖైరతాబాద్‌లో 49.9, నిర్మల్ జిల్లా పెండిలో 48.6 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News