Thursday, January 23, 2025

ఏడు జిల్లాలకు వర్షగండం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాగల మూడు రోజల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ఆవర్తనం ఉత్తర , మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ , ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశ వైపునకు వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అదే విధంగా తూర్పు , పశ్చిమ ద్రోణి సుమారు 15డిగ్రీల అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి.మి నుంచి 7.6కి.మి ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.

భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతే కాకుండా అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామబాద్ , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ ,హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాగల 24గంటల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రేగొండలో 57.8మి.మి వర్షం
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా జయశయంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 57.8 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాలలో గంగారంలో 57.5, జాఫర్‌గడ్‌లో 55.3, అంకంపాళెంలో 52.3, కూసుమంచిలో 46.8, మానేరులో 41.5, సుజాతానగర్‌లో 35.8, సలూరలో 34.3, కీసరలో 32.5, తిరుమలాయపాళెంలో 31, పెంట్లంలో 31, నర్సాపూర్‌లో 29.8, అలదుర్గ్‌లో 29.8, తొర్రూర్‌లో 29.5, రాంనగర్‌లో 29.3, టేకులపల్లిలో 26.5, పోచారలో 26.5, వీపనగండ్లలో 26 మి.మి చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News