ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో దంచికొట్టిన వాన
హుజూరాబాద్‌లోని చెల్పూర్‌లో ప్రాణాలకు తెగించి
విధులు నిర్వహించిన లైన్‌మన్, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
మన తెలంగాణ/హైదరాబాద్/హుజూరాబాద్/నిర్మల్ ప్రతినిధి: రాగల మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అ వకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈశాన్య బంగాళాఖా తం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైవు న్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కి.మి ఎత్తువరకూ అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల వాయువ్య, దాని పరిసర పశ్చిమమధ్య బంగాళాఖాతం లో రాబోయే 48గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరొక ఆవర్తనం నుండి ద్రో ణి ఒకటి ఉత్తర ఆంధ్రా తీరం వరకూ సముద్ర మట్టానికి 1.5 కి.మి, 3.1కి. మధ్యలో విస్తరించివుంది. మరొక ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రాంతాల్లో స ముద్రమట్టానికి 4.5 కి.మి , 5.8 కి.మి ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైవుంది. కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం ఆదివారం బలహీనపడిపోయింది. వీటి ప్రభావంతో రాగ ల మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆసిఫ్ నగర్‌లో భారీ వర్షం
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌నగర్‌లో 121.3 మి.మి వర్షం కురిసింది. పెద్దలింగాపురం లో 119.5, కనుకులలో 115, కందికొట్కూరులో 104. 8, సుగ్లంపల్లిలో 104.4 ఎల్లంతకుంటలో 102, కూనారంలో 100.5, కాల్వచెర్లలో 95, రంగంపల్లిలో 89, కుండారంలో 87, పోచంపల్లిలో 85, మార్ధన్‌పేటలో 85, జైపూర్‌లో 83, తాడిచర్లలో 83, కొమ్మెరలో 82, కరీంనగర్‌లో 81, అక్కాపూర్‌లో 80, కడ్డెంపెద్దూర్‌లో 80, గాంధారిలో 77, నేరెళ్లలో 75, సదాశివనగర్‌లో 75, కౌడిపల్లిలో 74, రామరెడ్డిలో 74, ముత్తరాం మహదేవపురంలో 74,వీమపల్లిలో 72,మంథనిలో 71, ఓదెలలో 71, పెద్దంపేటలో 69 మి.మి చోప్పున వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ప్రాణాలకు తెగించి మరీ..
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి జూనియర్ లైన్‌మెన్ అంబాల వెంకటేశ్వర్లు గ్రామానికి కరెంట్‌ను పునరుద్ధరించాడు. చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వరకు ఈదుకుంటూ వెళ్లి డిస్క్ మా ర్చి గ్రామానికి విద్యుత్తును అందించాడు. జూనియర్ లైన్‌మెన్‌పై విద్యుత్ అధికారులు, గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హుజురాబాద్ డివిజన్‌లోని రాజపల్లి 33/11 కేవి సబ్ స్టేషన్ నుండి చిలుకూరుకు 11 కెవి ఎక్స్‌ప్రెస్ ఫీడర్ లైన్ స్థానికంగా ఉన్న చెరువులో నుండి వెళ్తుంది. ఆదివారం ఉదయం చెరువులో ఉన్న ఒక స్తంభంపై 11 కెవి లైన్ బ్రేక్‌డౌన్ అయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెల్పూర్ జెఎల్‌ఎం వెంకటేశ్వర్లు, ఎఎల్‌ఎం పరశురాం లై న్ ఇన్‌స్పెక్టర్ చెరువులో ఈతకొట్టుకుంటూ వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధ్దరించా డు. చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు ఈత కొడు తూ వెళ్లి సరఫరాను పునరుద్ధ్దరించిన సిబ్బందిని ఎంపిపి రాణి సురేందర్ రెడ్డి, ఎస్‌ఈ గంగాధర్, అధికారులు అభినందించారు.
పగటి పూటే వెలిగిన వీధి దీపాలు
నిర్మల్‌లో ఆదివారం పట్ట పగలే కారు చీకట్లు కమ్ముకొచ్చాయి. మిట్ట మధ్యాహ్నం దాదాపు 1 గంట ప్రాంతం లో నల్లని మేఘాలతో చీకటిగా మారింది. దీంతో నిర్మల్ పట్టణంలోని వీధి దీపాలు పగటిపూటే దర్శనం ఇచ్చా యి. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలు హెడ్ లైటు వేసుకొని మరీ ప్రయాణాలు కొనసాగించారు. ఆదివారం మ ధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు ఎడతెరపి లేని వర్షంతో నిర్మల్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని మంచిర్యాల చౌరాస్తా, బస్టాండ్, ఈద్‌గాం చౌరస్తా , ముఖ్యంగా తిరుమల థియేటర్ ప్రాంతం మొ త్తం జలమయమై రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో రాకపోకలు స్తంభించగా ప్రయాణికులు తీవ్ర ఇ బ్బందు పడ్డారు. రోడ్ల పై ప్రవహించిన వర్షపు వరద నీటి తో మోటర్ సైకిళ్లు , కారు సైతం కొట్టుకపోయింది. దీం తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి దాదాపు గం ట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. రోడ్డుకు అనుకొని మెడికల్ క్లినిక్స్, పలు షాపుల్లోకి వరదనీరు వచ్చి చేరింది. దాదాపు 2 గంటల పాటు కురిసి న వర్షం నిర్మల్‌ను అతలాకుతలం చేసింది. దీం తో ప్రయాణికులతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.