Thursday, January 23, 2025

రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ రోజు విదర్భ నుంచి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మరింత సమాచారం కోసం వాతావరణ శాఖ వెబ్‌సైట్‌ను imdhyderabad.imd.gov.in సందర్శించాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News