హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురువడంతో రహదార్లన్నీ జలమయమయ్యాయి. మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా.. కూకట్ పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 13 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 12.5 సెంటీమీటర్లు, బోరబండలో 12.5 సెంటీమీటర్లు, జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్, షాపూర్, మూసాపేట్, జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు, బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 9.9 సెంటీమీటర్లు, గోషామహల్ లో 9.5 సెంటీమీటర్లు, మలక్ పేట్ లో 9.4 సెంటీమీటర్లు, ఫలక్ నామాలో 9.2 సెంటీమీటర్లు, కార్వాన్ లో 8.8 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 7.9 సెంటీమీటర్లు, ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం ప్రమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కుండపోత వాన కురవడంతో నగరంలోని పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి ముసిలోకి 442 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.