Sunday, January 19, 2025

ఢిల్లీకి వాన ముుప్పు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన కుండపోత వానకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమయ్యింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అయితే, ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ఢిల్లీకి మరోసారి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న 5 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో ఢిల్లీలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం ఉందని, యమునా నది ఉద్ధృతంగా ప్రవహించే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: రాజధానిని ముంచేందుకు కుట్ర: ఆప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News