Monday, December 23, 2024

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌ః జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్రమత్తం చేశారు.

భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా వాగులు, ఒంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. కాగా, రెండు రోజులపాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News