Sunday, January 19, 2025

రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో వాతావరణ శాఖ పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం దక్షిణ ఒడిశా పరిసరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులు
శనివారం పశ్చిమ మధ్య, పక్కనున్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం దక్షిణ ఒడిస్సా పరిసరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా షీయర్ జోన్ 20 ఎన్ అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీల ఎత్తులో ఇది కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 24వ తేదీన ఒక అల్పపీడనం దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి రాగల 4 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News