చెన్నై : తమిళనాడులోని 4 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో.. పశ్చిమ గాలుల వేగంలో మార్పు కారణంగా సెప్టెంబరు 6, 7 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తోందని అధికారులు వెల్లడించారు.
కోయంబత్తూరు జిల్లాలోని కొండ ప్రాంతాలు, నీలగిరి, తేని, దిండిగల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చెన్నై విషయానికి వస్తే.. రాగల 48 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఆగ్నేయ తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ దానిని ఆనుకుని ఉన్న కుమారి సముద్రంలో గంటకు 45 నుండి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.