- Advertisement -
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ రెండు రోజులు ఎపిలోని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12 వరకు మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Heavy Rains in AP for next 2 days
- Advertisement -