Sunday, December 22, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం!

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది. రేపటి నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే చాన్స్ ఉందని పేర్కొంది. తీరం వెంబడి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా నేడు తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కరుసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News