Tuesday, March 4, 2025

బ్రెజిల్‌లో భారీ వర్షాలు: 56 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బ్రసిలియా: బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలు పొటెత్తడంతో 56 మంది చనిపోయారు. కుండ పోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. కొన్ని ప్రాంతాలు నీళ్లలో మునిగిపోవడంతో ఇండ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు, రెస్కూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. భారీ వరదలు రావడంతో వందల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అల్ జజీరా, రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో విపరీతంగా నీటి మట్టాలు పెరిగిపోవడంతో ఆనకట్టాలు కుంగిపోయాయి. పోర్టో అలెగ్రే నగరానికి భారీ వరదలతో ముప్పు ఉందని అధికారులు వెల్లడించారు. బ్రెజిల్ చరిత్రలో ఇది ఘోరమైన విపత్తుగా ఆ దేశ ప్రజలు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News