- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీలో పడిన తొలి భారీ వర్షం ఇదేనని అధికారులు తెలిపారు.
ఈ మధ్యాహ్నం 2.30 గంటల వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో 111. 4 మి.మీల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అండర్‌పాస్‌ల్లోకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇండియా గేట్, ప్రగతి మైదాన్, నోయిడా మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్యంత రద్దీగా ఉండే కన్నౌట్ ప్యాలెస్ లోకి భారీగా వర్షం నీరు చేరింది.
- Advertisement -