- Advertisement -
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీనితో నగరవాసులు తీవ్రస్థాయిలో ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి సాగిన జామ్‌లతో ప్రత్యక్ష నరకం అనుభవించారు. వచ్చే కొద్ది రోజుల వరకూ ఢిల్లీ ఇతర ప్రాంతాలలో తేలిక పాటి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఈదురుగాలులు, భారీ వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 28.3 డిగ్రీల సెల్సియస్‌గా , గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదు అయింది. గాలిలో తేమ ఉదయం పూట రికార్డు అయిన దాని ప్రకారం 72 శాతంగా ఉందని ఐఎండి బులెటిన్‌లో తెలిపారు. ఇక కాలుష్య పరిణామాల స్థాయికి వస్తే ఢిల్లీలో శనివారం ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ సంతృప్తికరమైన స్థాయిలో 85వ కేటగిరిగా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర కాలుష్య నివారణ మండలి ఓ ప్రకటనలో తెలిపింది.
- Advertisement -