Sunday, December 22, 2024

గుజరాత్‌లో వరదలు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి వరదలు ముంచెత్తుతున్నాయి. తమకు తాత్కాలిక వసతి, ఆహారం అందించడంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారని విపుల్ అనే యువకుడు తీవ్ర నిరాశతో ఫినాయిల్ తాగి నిరసన వ్యక్తం చేశాడు.అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరదలకు చాలా మంది ఇళ్లలో చిక్కుకు పోయారని, వారిని రక్షించి తాత్కాలిక వసతి కల్పించాలని జిల్లా పంచాయితీ కి అనేక సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. బాధితులు జిల్లా అభివృద్ధి అధికారి (డిడిఓ )భంబీని ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో ఉన్నత స్థాయి అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన సమయంలో విపుల్ అనే యువకుడు డీడీఒ పైన వారికి ఫిర్యాదు చేశాడు. నిరసనను తెలియజేస్తూ తనవెంట తెచ్చిన ఫినాయిల్‌ను తాగాడు. అయితే జామ్‌నగర్ కలెక్టర్ భవిన్ పాండ్యా వరదల పరిస్థితిపై మాట్లాడుతూ ఇప్పటివరకు 20 వేల మందిని రక్షించామని, శిబిరాలకు తరలించి ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News