మన తెలంగాణ/సిటీ బ్యూరో : నగరాన్ని ముసురు కమ్మేసింది. సోమవారం రాత్రి మొదలైన వర్షం మంగళవారం కూడ కొనసాగింది.పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురువగా మరికొన్ని ప్రాంతాల్లో ముసురు పడింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మంగళవారం ఉదయంనుంచి రాత్రి వరకు దఫాలు దపాలుగా ముసురు పడడంతో బయటికి వచ్చిన వారంతాతడిసి ముద్దైయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు మరింత ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు నగరాన్ని పూర్తి మబ్బులు అవహించడంతో ఉదయం నుంచే చీకటి అలుముకుంది. మరో మూడు రోజుల పాటు భారీ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. ఏలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఎక్కడికక్కడ అత్యవసర సహాయక బృందాలను అధికారులు మోహరించారు. గత 36 గంటలో ఇప్పటీ వరకు గ్రేటర్ వ్యాప్తంగా 250 పైచిలుకు పిర్యాదులు అందగా అధికారులు అప్పటీ కప్పుడే పరిష్కరించారు.
వివిధ ప్రాంతాలు కురిసిన వర్షం వివరాలు….
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చందానగర్‌లో 18.3 మి.మి. కురువగా, లంగర్‌హౌజ్ 18.0 సె.మి. శివరాంపల్లి 17.0 మి.మి. రాజేంద్రనగర్ 16.5 చంద్రాయణ్‌గుట్ట, మలక్‌పేట్ 16.3, షేక్‌పేట్ 15.8, రాయదుర్గం15.5, కాంచన్ బాగ్ 15.5, కందికల్ గేట్ 15.3, బార్కస్ 15.0, దూద్‌బౌలి 14.8, మాదాపూర్ 14.5, ఫీలింనగర్ 14.3, జూబ్లీహిల్స్ 14.0, సర్ధార్ మహాల్ 14.0, ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి 13.8, గాజుల రామారం 13.8, గచ్చిబౌలి 13.3, శేరిలింగంపల్లి 13.0, యూసుఫ్‌గూడ 12.8, మూసాపేట్ 12.5, హాఫీజ్‌పేట్ 12.3, ఖాజాగూడ 12.0, ఆసీఫ్‌నగర్ 11.8, సంతోష్ నగర్, బేగంబజార్ 11.5, నాంపల్లి, అల్లాపూర్ 11.3, ఘన్సీబజార్ 11.0, కుత్భుల్లాపూర్ 10.8 మి.మి. వర్ష పాతం నమోదైంది.