మన తెలంగాణ/హైదరాబాద్: కుండపోత వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. గురవారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా నగరం స్తంభించిపోయింది. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడింది. దీంతో చీకట్లో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. గురువారం నాటి కుండ పోత వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమయ్యింది. మెహిదీపట్నం మాసాబ్ ట్యాంక్, లక్డీకాపూల్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మల్కాజ్‌గిరిలో పిడుగుపాటుతో ప్రజలు భయకంపితులయ్యారు. నేరేడ్‌మెట్ కాకతీయ నగర్‌లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అర్ధరాత్రివరకు వర్షం ఎడతెరిపి లకుండా కురుస్తూనే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి ఉండాలని సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను అడుగు మేర ఎత్తి 678 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్‌సాగర్ రెండు అడుగుల మేర ఎత్తి 442 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసిన దరిమిలా నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటన మరింత బెంబెలెత్తిస్తోంది.
Heavy Rains in Hyderabad