Wednesday, December 4, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వాన కురువడంతో రహదార్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపైకి భారీగా నీరు చేరుకోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలో మరో 3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరిస్తూ రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కుండపోత వర్షంతో డీఆర్ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News