Friday, January 24, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాలలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎన్‌ఆర్ నగర్, ఇఎస్‌ఐ, యూసఫ్‌గూడ, బోరబండ, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ , కోఠి, అబిడ్స్, చిక్కడపల్లి వంటి ప్రాంతాలో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. జిహెచ్‌ఎంసి సిబ్బంది రోడ్లపై వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News