హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురసింది. అత్యధికంగా నాగోల్ పరిధిలోని బండ్లగూడలో 21.2సెంటీమీటర్లు, ఉప్పల్ లో 20సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6 సెంటీమీటర్ల చొప్పున భారీగా వర్షం కురిసింది. అలాగే, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, నాంపల్లి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతంలోనూ వాన దంచికొట్టింది.దీంతో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించడంతోపాటు నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జిహెచ్‌ఎంసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో జిహెచ్‌ఎంసి అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Heavy Rains in Hyderabad