Friday, November 22, 2024

హైదరా’బాదింది’

- Advertisement -
- Advertisement -

గంటన్నరపాటు కుండపోతగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం

10రోజులుగా కురుస్తున్న వానలకు పరాకాష్టగా హైదరాబాద్ నగరాన్ని పట్టపగలే కుదిపేసిన వర్షం
ప్రవాహాలైన రోడ్లు, 48.8మి.మీ వర్షపాతం
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
రాయదుర్గం, మెహదీపట్నం మార్గంలో 3కి.మీ మేర నిలిచిన వాహనాలు
రాష్ట్రమంతటా వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. గంటన్నరపాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే 10 రోజులుగా రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కు రుస్తోంది. శని, ఆదివారాల్లో అతి భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పలుచోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది. రాయదుర్గం నుంచి మెహిదీపట్నం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద వరద నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు
నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు గంటన్నర పాటు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. ఇంజన్‌లోకి నీరు చేరి రెండు కార్లు రహదారికి అడ్డంగా ఆగిపోవడంతో లక్డీకాపూల్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బాలానగర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, కొంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని చెప్పారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగాల మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో 42.8 మిల్లీమీటర్లు
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో 79.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, యాదాద్రి భువనగిరిలో 58.8, కామారెడ్డిలో 56, జగిత్యాలలో 55.8, సంగారెడ్డిలో 54, కరీంనగర్‌లో 50.5, హైదరాబాద్‌లో 48.8, మంచిర్యాలలో 47.5, మహబూబాబాద్‌లో 44.3, నిజామాబాద్‌లో 42.8, ఖమ్మంలో 42.8, రంగారెడ్డిలో 39, మేడ్చల్ మల్కాజిగిరిలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rains in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News