Thursday, January 23, 2025

అర్ధరాత్రి భారీ వర్షం… మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద

- Advertisement -
- Advertisement -

Heavy rains in Hyderabad at Mid Night

హైదరాబాద్: భాగ్యనగరంలో అర్థరాత్రి భారీ వర్షాలు కురవడంతో నగరం తడిసిముద్దయింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వరదల ధాటికి ద్విచక్రవాహనాలు కొట్టుకపోయాయి. మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద వ్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. హైదరాబాద్ లో లోతట్టు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసిన వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్ల పైకి వరద నీరు చేరడంతో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వాహనాదారులు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో జిహెచ్‌ఎంపి, అధికారులు బల్దియా సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో నీరు పోయేలా చర్యలు చేపడుతున్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

https://twitter.com/HyderabadSalam/status/1551680788764143617

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News