Monday, January 20, 2025

నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

Heavy rains in Hyderabad in next two to three days

మన తెలంగాణ,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆలస్యమైన రుతుపవనాలు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తాజాగా రానున్న రెండు, మూడు రోజుల్లో నగరంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( జిహెచ్‌ఎంసి) అప్రమత్తమైంది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News