మనతెలంగాణ/ హైదరాబాద్ : భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు అలుగు పోస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం సొంత నియోజకవర్గ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు,అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరారు. వరదలతో ఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటన బాధాకరమని, అన్నదమ్ములు వరదలో కొట్టుకుపోయి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.
Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి