హైదరాబాద్: నగరంలో మంగళవారం సైతం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రం ఒక్కసారిగానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువంగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా మంగళవారం సైతం మరోసారి భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు.
అల్వాల్ సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే 3.6 సెం.మి.లు ఎల్‌బి నగర్ పరిసర ప్రాంతాల్లో 3 సె.మి.పైగా వర్షం వర్షం కురిసింది. దీంతో ఈ ప్రాంతాల్లోనే అనేక కాలనీలు, బస్తీలు పూర్తిగా జలమయం అయ్యాయి. అదేవిధంగా కాప్రా సర్కిల్‌లో 2.6 సె.మి. మల్కాజ్‌గిరిలో 1.8 సె.మి, ఉప్పల్‌లో 1.3, తిరుమల్ గిరి 1.2,సె.మి. వర్ష పాతం నమోదైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, బేగంపేట్, వెస్ట్ మారెడ్‌పల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట్, హైదర్‌నగర్, గాజుల రామారం, సికింద్రాబాద్, అడ్డగుట్ట, వనస్థలిపురం, పికెట్, నాచారం, సౌత్ హస్తినాపురం, కుత్భుల్లాపూర్, మొండా మార్కెట్, నాగోల్ తో పాటు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది.