Wednesday, April 2, 2025

దేశంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో 15 నుంచి 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

యమునోత్రి, గంగోత్రి రహదారుల మూసివేత

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోయలు, కొండలతో కూడిన చార్‌ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. ముఖ్యంగా యమునోత్రి, బద్రీనాథ్ మార్గం చమోలీ జిల్లాలో పరిస్తితి మరింత తీవ్రంగా ఉంది. చామి పట్టణ సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి 123. బద్రీనాథ్, దార్చులాతవాఘాట్ లిపులేఖ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఆ రహదారులన్నీ మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News