- Advertisement -
నైరోబీ: కెన్యాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. సుమారు 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర కెన్యా లోని గరిస్సా రోడ్డు సహా అయిదు ప్రధాన రహదారులు వరదల కారణంగా దెబ్బతిన్నాయని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
51 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొట్టుకుపోగా, అందరినీ రక్షించినట్టు పేర్కొన్నారు. తానా నదికి దిగువన ఉన్న స్థానికులు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెలాఖరునాటికి వర్షాలు కురవడం అత్యధిక స్థాయికి చేరుతుందని, అనంతరం జూన్ నాటికి తగ్గుతాయని కెన్యా వాతావరణ విబాగం తెలిపింది.
- Advertisement -