తిరువనంతపురం: కేరళలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 30, జూలై 2, 3 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం బలహీనపడింది. మహారాష్ట్ర తీరం నుంచి కేరళ తీరం వరకు అల్పపీడనం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ నుంచి కొన్నిచోట్ల భారీ వర్షాలు, జూలై 3, 4 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర వాతావరణ శాఖ వివిధ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సోమవారం కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు, మంగళవారం ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో 24 గంటల్లో 115.6 మి.మీ నుంచి 204.4 మి.మీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
కేరళలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -