- Advertisement -
ఖమ్మం: రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంతో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని పాల్వంచలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. రైల్వే పట్టాల మీదకు కూడా బారీగా వర్షపు నీరు చేరుకుంది. వర్షపు నీటితో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో భారీగా నీరు నిలిచిపోయింది. వర్షం నీరు బయటికి వెళ్ళే మార్గాలు సరిగా లేక డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే షెడ్లలో ఉన్న పంట ఉత్పత్తులు తడిచే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పట్టించుకోకపోతే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
.
Heavy Rains in Khammam
- Advertisement -