Wednesday, January 22, 2025

కోహెడ మండలంలో చెక్‌డ్యాంల జలకళ

- Advertisement -
- Advertisement -

Heavy rains in Koheda mandal

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కోహెడ: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోహెడ మండలంలో చెరువులు, చెక్‌డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి. మండల పరిధిలోని విజయ నగర్ కాలనీ, నారాయణపూర్ గ్రామంలోని ఎల్లమ్మ వాగు చెక్ డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండు కుండలా మారింది. అలాగే గుండారెడ్డి పల్లి గ్రామంలోని ఒగ్గపాగు చెక్ డ్యాం మత్తడి దుంకుతుంది. నిండు కుండలా కళకళలాడుతూ మత్తడి దుంకుతున్న దృశ్యాన్ని చూసి గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News