Monday, December 23, 2024

పొంగిన నర్మద ..దీవిలో చిక్కిన నలుగురు

- Advertisement -
- Advertisement -

జబల్పూరు : మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలతో జబల్పూరు ప్రాంతంలో నర్మదా నదీ పొంగి ప్రవహించింది. ఈ క్రమంలో భేడాఘాటు వద్ద ఉన్న చిన్న దీవిలో నలుగురు చుట్టూ నది నిటి మధ్య చిక్కుపడ్డారు. 13 గంటల పాటు శ్రమించిన తరువాత వీరిని సోమవారం ఉదయం ఎన్‌డిఆర్‌ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఇసుక తిన్నెల దీవిగా ఉండే ఈ ప్రాంతానికి జబల్పూరులోని గర్హపుర్వాకు చెందిన నలుగురు ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలతో నర్మద నదీ పొంగిపొర్లింది.

దీనితో ఈ నలుగురు దీవి మధ్యలో బందీలు అయ్యారు. ఓ వైపు నర్మద నీరు మట్టం పెరుగుతూ ఉండటంతో ఎప్పుడు తాము కొట్టుకుపోతామో అనే భయంతో గడిపారు. ఈ క్రమంలో పరిస్థితిని తెలుసుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ సాయంత్రం ఐదుగంటలకు తమ ఆపరేషన్ చేపట్టింది. నది సుడులు తిరుగుతూ ఉండటం, రాత్రిపూట కావడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. తరువాత వీరిని గుర్తించి ముందుగా డ్రోన్ల ద్వారా ఆహారప్యాకెట్లు, లైఫ్ జాకెట్లు అందించారు. తెల్లవారుజామున వీరిని బయటకు తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News