విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, చెట్లు
నేల రాలిన మామిడి, వరి పంటకు
నష్టం విద్యుత్ సరఫరాకు తీవ్ర
అంతరాయం ఆలంపూర్
మండలంలో వడగండ్ల వానతో
పొగాకు రైతులకు నష్టం మల్దకల్
మండలంలో పిడుగుపాటుతో రెండు
ఎద్దులు మృతి
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/గద్వాల : నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఆదివారం సా యంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు మండ లం, పర్వతాయపల్లి, కుమ్మెర తదితర గ్రామాలలో వడగండ్ల వాన కురిసింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పెద్ద ఎత్తున చెట్లు నే లకూలాయి. రోడు,్ల కల్లాలపై ఆరబోసిన మొక్కజొ న్న వర్షం ధాటికి కొట్టుకుపోయింది. తాడూర్, నాగర్‌కర్నూల్ మండలాలతో పాటు తెలకపల్లి తదితర మండలాల్లో భారీగా వర్షం పడింది. జిల్లా కేంద్రంలో హోల్డింగ్‌లు కూలిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు తెగి పడడంతో ఆదివారం రాత్రి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రేకు ల షెడ్లు సపారాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సం ఖ్యలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.
కోత దశకు వచ్చిన మామిడికాయలు భారీ ఈదురుగాలి కారణంగా కాయలు నేలరాలాయి. నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు పండించిన పంట కొనుగోలు కేంద్రాలలో ఒకేసారి వర్షం, తీవ్రమైన గాలి వీచడంతో ధాన్యం తడిసిపోయి టార్పాలిన్లు కొట్టుకుపోవడంతో రైతులు అసహనానికి గురయ్యారు. వారం రోజులు వర్షం పడకుంటే వడ్లు, మక్కలు అమ్ముకునే వారమని రైతులు పేర్కొన్నా రు. పెంట్లవెల్లి మండలంలో ఆదివారం సాయం త్రం వీచిన గాలి బీభత్సానికి పలు పంటలు దెబ్బతిన్నాయి. గోపాలపురం, సింగవరం, కోడూరు గ్రామాలలో చెరువు, బోర్ల కింద దాదాపు 1,500 ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారు. వారం, పది రోజుల్లో కోతకు సమాయత్తమవుతుండగా సాయంత్రం వీచిన గాలులకు వరి పంట నేలకొరిగింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.
పక్వానికి రాకముందుకే రాలడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృ ష్టించింది. వరి, మొక్కజొన్న నేలకొరిగాయి. ధా న్యం కల్లాల్లో తడిసి ముద్దయింది. భారీ గాలివాన కు భారీ చెట్లు నెలకొరిగాయి. రేకుల ఇల్లు, పెంకుటిళ్లు పడిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరగడం తో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీ గాలివానకు సాయినిపల్లిలో చెవిటి శంకర్ ఇంటి పైక ప్పు లేచిపోవడంతో ఇంట్లోనే తల దాచుకునేం దుకు భయపడడంతో చుట్టుపక్కల వాళ్లు అతన్ని కాపాడారు. లట్టుపల్లి గ్రామంలో గత 15 రోజుల క్రితం ఆరబెట్టిన ధాన్యం తడిసి పాడైంది. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండల పరిధిలో వెంకటాపురం, ఉప్పల, పర్దిపురం, తుపత్రాల, తదితర గ్రామాల్లో గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించిం ది. వెంకటాపురంలో చెట్లు, విద్యుత్ వైర్లు నేల కు వాలడంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. అలంపూర్ మండల కేంద్రంలోని లింగనవా యి, క్యాతూరు, కొనేరు, బుక్కాపురం, గొందిమల్ల, ర్యాలంపాడు, సింగవరం, భీమవరం గ్రామాలలో ఆదివారం కురిసిన వడగండ్ల వానతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మల్దకల్ మం డలం, చిప్పదొడ్డి గ్రామంలో పిడుగుపాటుతో రెం డు ఎద్దులు మృతి చెందాయి. మేడ్కుందా రామన్ గౌడ్ అనే రైతు ఎద్దులు పొలం దగ్గర ఉండగా ఉరుము పడి మృతి చెందాయి. ఎద్దుల విలువ దాదాపు రూ.2 లక్షల వరకు ఉండనునట్లు రైతు తెలిపారు.