Thursday, February 13, 2025

మహారాష్టకు కుండపోత గుండెకోత..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు వీడకుండా పడుతున్నాయి. మహానగరం ముంబై కుండపోత వానలతో అతలాకుతలం అయింది. శుక్రవారం ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో పలు చోట్ల ట్రాఫిక్‌కు గంటల పాటు అంతరాయాలు ఏర్పడ్డాయి. శనివారం కూడా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనితో శనివారం ఫల్ఘార్ ఇతర ప్రాంతాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. శుక్రవారం థానే, పల్ఘార్, రాయ్‌గఢ్‌లలో వానలు వీడకుండా కురిశాయి.

ముంబై మెరీనా బీచ్ వెంబడి ఉవ్వెత్తున సముద్ర అలలు విరుచుకుపడ్డాయి. కాగా రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌గడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకూ 22 మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కేవలం దిబ్బలతో కన్పిస్తోంది. కాగా ముంబైలో పలు ప్రాంతాలలో గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు , ఇతర సహాయక సంస్థలు పెద్ద ఎత్తున ఆహారపొట్లాలు, మంచినీటి సరఫరాతో బాధితులను ఆదుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News