Sunday, December 22, 2024

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains in many districts across the state

జయశంకర్ భూపాలపల్లిలో అత్యధికంగా 110 మిల్లీమీటర్ల వర్షపాతం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం జయశంకర్ భూపాలపల్లిలో అత్యధికంగా 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా మిగతా జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కొంకణ్ తీరం నుంచి మహారాష్ట్ర తెలంగాణ దక్షిణ ఛత్తీస్‌ఘడ్, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మీదగా తీవ్ర అల్పపీడన ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఆదివారం బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలోని పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్రఅల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదిలి ఆదివారం ఉదయం 5.30 గంటలకు వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఈ వాయుగుండం దక్షిణ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిస్సా, దక్షిణ చత్తీస్‌ఘడ్ మీదుగా వెళుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సగటు సముద్ర మట్టం వద్ద ద్రోణి నలియా, అహ్మదాబాద్, బ్రహ్మపురి, జగ్ధల్ పూర్, దక్షిణ ఒడిస్సా ప్రాంతంలోని వాయుగుండం మధ్య ప్రాంతం మీదుగా, తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నిర్మల్‌లో 92, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 85, మంచిర్యాలలో 85, నిజామాబాద్‌లో 78, ఆదిలాబాద్‌లో 78, మెదక్‌లో 69, ములుగులో 69, హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిలో 20, మేడ్చల్ మల్కాజిగిరిలో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News