Saturday, December 21, 2024

ముంబయిలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy Rains in Mumbai

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల నుంచి  భారీ వర్షాలు కురుస్తుండడంతో థానే, నవీ ముంబయి నీట మునిగిపోయింది.  అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రహదారులు సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లతో ప్రజాజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అంధేరీ సబ్ వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News