Thursday, April 3, 2025

ఉత్తరాదిలో జల ప్రళయం.. గ్రామాలను ముంచెత్తున్న వరదలు(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాలను వరదలు ముంచెత్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదల ధాటికి ప్రజలు నివాసులు కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. ఓ వైపు వరద, మరోవైపు కొండ చర్యలు విరిగి పడుతుండడంతో ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు.

ఈ నేపథ్యంలో వర్ష ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోడీ అరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్ డిఆర్ఎప్ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాదిలో జల ప్రళయం సృష్టిస్తున్న విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: హిమాచల్‌లో భారీ వర్షాలు: చిక్కుకుపోయిన వందలాది పర్యాటకులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News