Thursday, January 23, 2025

ఖరీఫ్‌కు కలిసిరాని కాలం

- Advertisement -
- Advertisement -

ఉత్తరాదిన అతివృష్టి.. అనావృష్టి

గత ఏడాదికంటే 33శాతం తగ్గిన పంటల సాగు, విస్తీర్ణం వరినాట్లలో 17లక్షల హెక్టార్లు కోత
61లక్షల హెక్టార్ల వద్దే ఆగిన నూనెగింజ పంటలు, పత్తి సాగులో భారీ లోటు

ఉత్తర భారతం ఉరుముతోంది. భారీ వర్షాలు వరదలతో పలు రాష్ట్రాలు మునిగితేలుతున్నాయి. అతివృష్టి బారిన పడి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాలకు భారీగా గండి పడింది.. మరో వైపు దక్షిన భారతం అనావృష్టితో గిలగిల కొట్టుకుంటొంది. ఖ రీఫ్ ప్రారంభమైన ఆరు వారాలు గడుస్తున్న సాధారణ వర్షపాతం లేక వ్యవసాయ పనులు ముందు కు సాగడం లేదు. ఆహార పంటలతో పాటు నూనెగింజ పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణపు లక్ష్యాలు వర్షాభావ దుర్భిక్ష పరిస్థితుల్లో చిక్కి ఎండిపోతున్నాయి. దేశంలో ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి ఈ సమయానికి అన్ని రకాల పంట లు కలిపి 353 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనం పడాల్సివుంది. గత ఏడాది ఖరీఫ్‌తో పోల్చితే సాగు విస్తీర్ణపు లక్ష్యాలకు భారీగా గండి పడింది. గత ఏ డాది ఈ సమయానికి 387 లక్షల హెక్టార్లలో పం టలు సాగులోకి వచ్చాయి. వరిసాగు విస్తీర్ణం 54. 12లక్షల హెక్టార్లకు మించలేదు. గత ఏడాది ఈ సమయానికి 71.10లక్షల హెక్టర్లలతో వరి సాగులోకి వచ్చింది. కంది, పెసర, మినుము తదితర అ న్ని రకాల పప్పుధాన్య పంటల సాగు 32.62లక్షల హెక్టార్లలో విత్తనం పడింది.

గత ఏడాది ఈ పాటికి 43.96లక్షల హెక్టార్లలో పప్పుధాన్య పం టలు సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటల విస్తీర్ణం కూడా బిక్కుబిక్కు మంటోంది. వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, సోయాబీన్, కుసుమ, నూగు, తదితర పంటలు కలిపి ఇప్పటివరకూ 61.10లక్షల హెక్టార్లలోనే విత్తనాలు పడ్డాయి. గత ఏడాది ఈ సమయానికి 71.30లక్షల హెక్టార్లలో నూనెగింజ పంటలు సాగులోకి వచ్చాయి. ప్ర ధాన వాణిజ్య పంటల సాగుకు సంబంధించి పత్తిసాగులో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 70.56లక్ష ల హెక్టార్లలో పత్తి విత్తనం పడింది. గత ఏడాది ఇ ప్పటికే 79.15లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు వే శారు. ఒక్క చెరకు సాగు మాత్రమే గత ఏడాది విస్తీర్ణం కంటే 2.50లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అధికంగా సాగులోకి వచ్చింది. ఈ ఏడాది 55.81లక్షల హెక్టార్లలో చెరకు సాగులోకి రాగా గత ఏడా ది 22.81లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు సాగు జరిగింది.

బతికి బట్టకట్టేదెంత?
అయితే ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి ఇప్ప టివరకు పొలాల్లో పడ్డ విత్తనం కూడా సాగులక్ష్యాలకు స్థిరమైన భరోసా ఇవ్వడం లేదు. ఉత్తరభారతంలో వేసిన విత్తనం కుండపోతగా కురుస్తున్న వ ర్షాలతో పొలాల్లోనే కుళ్లిపోతోంది. మొలకెత్తిన లే తపైర్లు కూడా జోములెక్కి దెబ్బతింటున్నాయి. కొ న్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల బారిన పడి నీ ట మునిగితేలుతున్నాయి. వర్షాలు తెరిపినిచ్చి వరదనీరు తొలగిపోతే కాని ఇప్పటివరకూ సాగు చేసి న పంటల్లో బతికి బట్టగలిన పంటల విస్తీర్ణం ఎంత, వర్షాలకు దెబ్బతిన్న పంటల విస్తీర్ణం ఎంత అ న్నది చెప్పజాలమని కేంద్ర వ్యవసాయశాఖ వర్గా లు చెబుతున్నాయి.

దక్షిణ భారత దేశలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ప్రతికూల వాతావరణం నెలకుంది. ఇక్కడ నైరుతి రుతుపవాల రాక లో అలవి మాలిన జాప్యం జరగడం, ఇప్పటివర కూ సరైన వర్షాలు లేకపోవటం ఖరీఫ్ పంటల సాగుకు ప్రతిబంధకంగా మారింది. వేసిన పైర్లు కూడా వాడిపోతున్నాయి. తెలంగాణతోపాటు ఆం ధ్రప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇప్పటివరకూ వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకోలేదు. వందకు పైగా జిల్లాల్లో లోటు వర్షపాతం లో చిక్కి పంటల సాగు లక్ష్యాలు ఎండిపోతున్నా యి. నేలలో తేమ లేక మొలక దశలోనే పైర్లు ఎండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతు లు రెండవ సారి పత్తి విత్తనం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని పంటల పరిస్థితి కూడా అదేవిధంగా ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎల్.భాస్కర్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News