Thursday, January 23, 2025

రానున్న 24 గంటల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rains in northern Telangana in next 24 hours

హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండగా రిజర్వాయర్లలోకి భారీగా వరదనీరు చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతోపాటు రానున్న 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News