Thursday, September 19, 2024

సెప్టెంబర్‌లో భారీ వర్షాలు..వరదలు

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్‌లో దేశలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే వాయువ్య భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో వరదుల కూడా సంభవించే అవకాశాలుఉన్నట్టు అంచనా వేసింది. దీర్ఘకాల సగటు వర్షపాతం 167మి.మీలో 109 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు శనివారం నాడు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వాతావరణ శాఖ అంచనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

సెప్టెంబరులో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పరిసర ప్రాంతాలు సహా వాయువ్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరదలు రావొచ్చని , కొండచరియలు, మట్టి దిబ్బలు విరిగి పడే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. అందుకే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సెప్టెంబరులో ప్రతివారానికొకసారి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ఏర్పడే అవకాశం ఉందని. ఇవి పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాన్ వైపు వెళ్లొచ్చని, అలాగే హిమాలయాల వైపు మారొచ్చు అని , ఈ అల్పపీడన ద్రోణుల వల్ల దేశవ్యాప్తంగా గణనీయమైన మొత్తంలో వర్షాలు కురుస్తాయి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News